పులివెందులకు బయలుదేరిన వైయస్ జగన్
22 Jun, 2024 12:54 IST
కృష్ణా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. వైయస్ జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి కడపకు బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయంలో వైయస్ జగన్ రాక సందర్భంగా జై జగన్ నినాదాలతో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు వెళ్లనున్నారు. కాగా, వైయస్ జగన్ మూడు రోజుల పాటు పులివెందుల పర్యటనలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.