అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
26 Oct, 2024 21:19 IST
తాడేపల్లి: అనంతపురం జిల్లా శింగనమల మండలం నాయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారు – లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల కుటుంబాలకు వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.