గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
20 Mar, 2026 16:55 IST
తాడేపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో స్నానం చేసేందుకు దిగిన ఏడుగురు విద్యార్థుల్లో ఐదుగురు గల్లంతైన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విషాదకరమన్న ఆయన ఉన్నత భవిష్యత్ ఉన్న విద్యార్ధులు ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
వీరంతా అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.