జవాన్ మురళీ నాయక్ వీరమరణంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
9 May, 2025 12:56 IST
తాడేపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కళ్ళి తండా గ్రామానికి చెందిన జవాన్ మురళీ నాయక్ జమ్ముకాశ్మీర్‌లో వీరమరణం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశభద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమంటూ ఆయన కుటుంబానికి సంతాపం ప్రకటించారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.