ఆటో బోల్తాపడి నలుగురు మృతిచెందడంపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
2 May, 2025 21:45 IST

తాడేపల్లి: నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి వద్ద ఆటో బోల్తాపడి నలుగురు దుర్మరణం చెందడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదోనికి చెందిన వారు శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. దైవ దర్శనం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్ళే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.