మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మృతిపై వైయ‌స్ జగన్ దిగ్ర్భాంతి 

2 Oct, 2025 12:57 IST

తాడేపల్లి: మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతిపై వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మా కుటుంబానికి స‌న్నిహితులు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి మృతి బాధాక‌రం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ధైర్యం ప్ర‌సాదించాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. 

కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ‘టైగర్‌ దామన్న’గా సుపరిచితులైన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు  రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణరెడ్డి, కమలాదేవి దంపతులకు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 1952 సెప్టెంబర్‌ 14న జన్మించారు.