నలుగురు వ్యవసాయ కూలీల మృతిపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి
13 May, 2025 10:48 IST
తాడేపల్లి: పల్నాడు జిల్లా వినుకొండ మండలం శివాపురం వద్ద బొలెరో ట్రక్ - లారీ ఢీ కొన్న ఘటనలో నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం చెందడంపై వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులంతా ప్రకాశం జిల్లాకు చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తించారు, వారంతా మృత్యువాత పడటంపై వైయస్ జగన్ తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.