అక్టోబ‌ర్ 15 నుంచి రైతు భ‌రోసా ప‌థ‌కం ప్రారంభం

6 Jun, 2019 12:27 IST

అమరావతి:  రైతుల‌కు ఇచ్చిన మాట‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిల‌బెట్టుకున్నారు.  రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన‌ట్లు సీఎం ప్ర‌క‌టించారు. వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు అక్టోబ‌ర్ 15 నుంచి రైతు భ‌రోసా ప‌థ‌కం ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. ఎన్నిక‌ల హామీ మేర‌కు రైతుల‌కు రూ.12,500  ప్ర‌క‌టించారు. రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర అందేవిధంగా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్ల తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించేవారిపై  కఠినంగా వ్యవహరించాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.. నకిలీ విత్తనాల చలామణిపై సీఎం వైయస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన విత్తన చట్టం తీసుకురావాలని అధికారుల సూచనలు చేయగా, అసెంబ్లీలో చర్చించి కొత్త చట్టం తీసుకువద్దామని సీఎం తెలిపారు. వ్యవసాయ అవసరాలకు గ్రామ సచివాలయాలు కేంద్రంగా పనిచేయాలని సీఎం తెలిపారు. రైతులకు ప్రభుత్వ సేవలపై నమ్మకం కలిగించాలని నాణ్యమైన విత్తనాలు గ్రామ సచివాయాల ద్వారా పంపిణీ చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. రైతులకు బీమా సౌకర్యం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని, ప్రీమియం కూడా పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం తెలిపారు..సీఎం ముఖ్య సలహాదారు అజేయ్‌ కల్లం,ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌, వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్‌కుమార్,ముఖ్య కార్యదర్శి రాజశేఖర్,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్,వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డి  హాజరయ్యారు