వైయస్ జగన్‌కు వినతుల వెల్లువ..
13 Jan, 2019 14:32 IST
వైయస్‌ఆర్ జిల్లా: ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేసుకుని పులివెందులకు వచ్చిన వైయస్ జగన్‌కు తమ నియోజకవర్గంలోని సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. జగన్ నివాసానికి ప్రజలు అధికసంఖ్యలో చేరుకున్నారు. వైయస్ జగన్ వారి సమస్యలు తెలుసుకుంటూ భరోసా ఇస్తున్నారు.వైయస్‌ఆర్‌సీపీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలు అంటున్నారు.అం«ధులు, ఎన్టీఆర్ వైద్యమిత్రలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి రాగానే వైయస్ జగన్ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Tags