ఓర్వకల్లు చేరుకున్న వైయస్ జగన్
18 Mar, 2019 11:37 IST
కర్నూలు: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి కొద్దిసేపటి క్రితమే కర్నూలు జిల్లా ఓర్వకల్లుకు చేరుకున్నారు. తొలిరోజు ప్రచారంలో ఆయన ఆదివారం విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండో రోజు సోమవారం జననేత మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, వైయస్ఆర్, అనంతపురం జిల్లాల్లో వైయస్ జగన్ ప్రచారం చేస్తారు. 12 గంటలకు అనంతపురం జిల్లా రాయదుర్గం, మధ్యాహ్నం 2 గంటలకు వైయస్ఆర్ జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.