ఏపీ భవన్‌కు చేరుకున్న వైయస్ జగన్
26 May, 2019 17:14 IST
ఢిల్లీ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఢిల్లీలో అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తుంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలతో భేటీ అనంతరం వైయస్ జగన్ ఏపీ భవన్‌కు చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జననేతకు ఘనస్వాగతం పలికారు. ఏపీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైయస్ జగన్‌కు వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం పలువురు అధికారులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి జననేతకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.