సీఎస్‌ఐ చర్చిలో వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు..
12 Jan, 2019 12:25 IST
వైయస్‌ఆర్ జిల్లా:పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో కుటుంబసభ్యులతో బాటు వైయస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ భగవంతుని దయ, అందరి ప్రార్థనలతో ప్రజా సంకల్పయాత్ర విజయవంతమైందన్నారు. ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.పులివెందులలో దారి పొడవునా వైయస్ జగన్‌కు అభిమానులు ఘనస్వాగం పలికారు.
గురువారం కాలినడకన సామాన్య భక్తుడిలా తిరుమలకు చేరిన ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీవారి దర్శనం చేసుకున్నారు.శుక్రవారం కడపలోని అమీర్‌పిర్ దర్గాను సందర్శించారు.నేడు పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.