తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక పొట్టి శ్రీ‌రాములు

16 Mar, 2026 12:00 IST

తాడేపల్లి: ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయుడు, అమరజీవి పొట్టి శ్రీ‌రాములు జయంతి  సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైయ‌స్ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ… తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని పేర్కొన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించాలనే మహోన్నత లక్ష్యంతో ఆయన చేసిన నిరాహార దీక్ష, ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని తెలిపారు. ఆయన త్యాగం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ, పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తన వినమ్ర నివాళులు అర్పిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు.