రోశయ్య సేవలు చిరస్మరణీయం
4 Jul, 2025 12:37 IST
తాడేపల్లి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోశయ్య రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ రోశయ్య జయంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డితో రోశయ్య ఉన్న ఫొటోను పోస్టు చేశారు.