అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయ‌స్ జగన్ నివాళులు

7 May, 2026 11:45 IST

తాడేప‌ల్లి:  విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారు నివాళులర్పించారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి, బ్రిటీష్ పాలకులను ఎదురించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. స్వరాజ్య సాధన కోసం ఆ సమరయోధుడు సాగించిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన్యం జిల్లాకు ఆయన పేరు పెట్టి గౌరవించుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.