ఎస్పీ బాలు జయంతి.. వైయస్ జగన్ నివాళులు
4 Jun, 2026 12:13 IST
తాడేపల్లి: నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్.. ఆయనకు నివాళులు అర్పించారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా..‘సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వేలాది పాటలు ఆలపించినా, ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహా గాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.