సేవాలాల్ మహారాజ్‌కి వైయస్ జగన్ నివాళి
15 Feb, 2026 19:00 IST
తాడేపల్లి: సేవాలాల్ మహారాజ్‌కి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘బంజారా ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. సమాజ సేవే ఉన్నతమైన ధర్మమని చాటి చెప్పిన ఆ మహనీయుడి ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయం. నేడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.