తలశిల చంద్రశేఖర్‌రావు భౌతికకాయానికి వైయస్ జగన్ నివాళి
18 Feb, 2026 15:14 IST
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ తండ్రి తలశిల చంద్రశేఖర్‌రావు (88) ఇవాళ మరణించడంతో ఆయన భౌతికకాయానికి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. గొల్లపూడిలోని తలశిల రఘురామ్ నివాసానికి వెళ్లిన వైయస్ జగన్, చంద్రశేఖర్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. చంద్రశేఖర్‌రావు మరణం తలశిల రఘురామ్ కు, వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ దుఃఖ సమయంలో తలశిల రఘురామ్ కు, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, చంద్రశేఖర్‌రావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నానని వైయస్ జగన్ తెలిపారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా హాజరై కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.