బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
6 Jul, 2024 10:46 IST
తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి , దేశ మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్ గారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, దేశ ఉపప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయం. నేడు బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.