సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు వైయ‌స్ జ‌గ‌న్ నివాళి

15 Nov, 2025 17:07 IST

తాడేప‌ల్లి:  సినీ న‌టుడు సూప‌ర్‌స్టార్ కృష్ణ వ‌ర్ధంతి సంద‌ర్భంగా  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నివాళుల‌ర్పించారు. ఈ మేరకు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూర‌గొన్న గొప్ప‌ న‌టుడు పద్మభూషణ్ సూప‌ర్ స్టార్‌ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్త‌దనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయ‌న‌. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది.  కృష్ణ గారి వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.