టంగుటూరు ప్ర‌కాశం పంతులుకు వైయ‌స్ జ‌గ‌న్ ఘ‌న నివాళులు

20 May, 2025 11:34 IST

తాడేప‌ల్లి: స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం  టంగుటూరి ప్ర‌కాశం పంతులు వర్ధంతి కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, అలజంగి జోగారావు, తిప్పల నాగిరెడ్డి, మళ్ళ విజయ్‌ ప్రసాద్‌, వాసుపల్లి గణేష్‌, పలువురు సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. 
 
ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్ ..
స్వాతంత్ర్య స‌మ‌ర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్ర‌కాశం పంతులు గారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి ఆయ‌న‌. నేడు ప్రకాశం పంతులుగారి వర్ధంతి సందర్భంగా నివాళులు అంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.