రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైయస్ జగన్ నివాళి
7 May, 2026 15:57 IST
తాడేపల్లి: మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘దేశ స్వాతంత్ర్య పోరాటంలో జన గణ మనతో జాతీయ స్ఫూర్తిని రగిలించిన విశ్వకవి, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడు ఆయన. నేడు రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆ మహాకవికి నివాళులు’’ అంటూ వైయస్ జగన్ ట్వీట్ చేశారు.