వైయస్ జగన్ పరామర్శ..
27 Mar, 2019 18:26 IST
తూర్పుగోదావరి: మండపేట నియోజకవర్గంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన బహిరంగ సభలో జనం కిక్కిరిసిపోయారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తరలిరావడంతో సభాస్థలం మొత్తం జనసంద్రమైంది. స్థలం సరిపోకపోవడంతో బిల్డింగ్‌లు ఎక్కి మరీ వైయస్ జగన్ ప్రసంగం విన్నారు. దీంతో పాత భవనం పిట్టగోడ కూలి పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భవనం శిథిలావస్థకు చేరడంతో జనం తాకిడికి తట్టుకోలేక పిట్టగోడ కూలిపోయింది. గాయపడిన వారిని ఆస్పత్రికి వెళ్లి వైయస్ జగన్ పరామర్శించారు.