అజిత్ పవార్ మృతి పట్ల వైయస్ జగన్ దిగ్భ్రాంతి
28 Jan, 2026 12:26 IST
తాడేపల్లి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతిపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వ్యక్తుల కుటుంబాలకు కూడా వైయస్ జగన్ సంతాపం ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు పోస్టు పెట్టారు.