ఆ సంఘటన కలిచివేసింది..

5 Mar, 2019 17:17 IST

నెల్లూరు: జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు  ఒక సంఘటన కలిచివేసింది.  ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూంటే ఒక పెద్దాయన,పెద్దమ్మ కన్నీరుతో నా ముందుకు వచ్చారు. పక్కన వారి గుడిసెకు  ఒక ప్లెక్సీకి దండవేసి వుంది. వారు ఏడుస్తూ అన్న మాట ఏమిటంటే ఆ ఫోటోకు దండవేసి ఉన్న వ్యక్తి నా కొడుకు అన్నా.. చనిపోయాడన్నా అని అన్నారు. నాకు చాలా బాధ అనిపించింది. నా కొడుకు మంచి స్టూడెంట్‌ అన్నా.., ఇంటర్‌లో మంచి మార్కులు వచ్చాయన్నా..ఇంజనీరింగ్‌ చదివిస్తే బాగా చదువుకుని బాగుపడతాడు అని మేమంతా ఆశ పడ్డామన్నా.. తీరా చూస్తే ఇంజనీరింగ్‌ ఫీజులు సంవత్సరానికి లక్ష రూపాయలు అడుగుతున్నారన్నా అని  చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందా..అని నేను అడిగాను..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 30 నుంచి 35 వేలు వస్తోందన్నా..అది కూడా సరిగా ఇవ్వని పరిస్థితి  అన్నారు. ఇంజనీరింగ్‌కు మూడు సంవత్సరాలకు మూడు లక్షల కట్టాలంటే..మాలాంటి వారికి కష్టమన్నా అన్నారు. ఇంజనీరింగ్‌ చదివించడానికి 75 వేల రూపాయలు అప్పు తీసుకుని వచ్చి నా కొడుకుని కాలేజీలో చేర్పించానన్నా.. అని అన్నారు. రెండో సంవత్సరం కూడా 75 వేల రూపాయలు కావాలి నాన్నా.. ఎక్కడ నుంచి తీసుకువస్తావు నాన్నా అని నా కొడుకు  అడిగాడని.. ఎదో ఒకటి చేసి ఆ డబ్బు తీసుకువస్తానని నా కొడుకుతో చెప్పి..కాలేజికి పంపించాను అన్నా అన్నాడు. ప్రతి సంవత్సరం అప్పులు చేసి తనను చదివిస్తున్నారని..తల్లిదండ్రులు కష్టం చూడలేక కాలేజికి వెళ్ళి నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడన్నా అని కన్నీరుమున్నీరయ్యారని తెలిపారు. ఆయన చెప్పిన మాటలు జీవితంలో ఎప్పుడు మరిచిపోలేనన్నారు.ప్రతి పేదవాడికి హామీ ఇస్తున్నా.. పేదరికానికి, చదువుకు సంబంధం లేకుండా చేస్తా..ప్రతి ఇళ్లలోనూ డాక్టర్లు,ఇంజనీరు,కలెక్టర్‌ కావాలన్నారు. ఆ చదువులు కోసం పేదరికం అడ్డుకాకూడదు. పిల్లలను ఎన్ని లక్షల రూపాయలు ఖర్చుచేసైనా చదివిస్తానని ప్రతి తల్లిదండ్రులకు చెప్పుతున్నాను. మెస్‌ చార్జీలు,హాస్టల్‌ ఫీజులకు ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 20వేల రూపాయలు ఇస్తాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చేస్తానని హామీ ఇస్తున్నా.. అని తెలిపారు..