ప్రముఖ నటి బి.సరోజా దేవి మృతి పట్ల వైయస్ జగన్ సంతాపం
14 Jul, 2025 12:11 IST
తాడేపల్లి: ప్రముఖ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బి. సరోజా దేవి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని ఆయన గుర్తుచేసుకున్నారు. సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సరోజాదేవి చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారని పేర్కొన్నారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని వైయస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.