మార్పు కోసం ఓటెయ్యండి
4 Apr, 2019 13:15 IST
నెల్లూరు: రాబోయే ఎన్నికల్లో మార్పుకు ఓటు వేయాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐదేళ్లుగా మనస్సు లేని పరిపాలన, అవినీతి పరిపాలన చూశామని, ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇవ్వండి..రాజన్న రాజ్యం తీసుకొస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పేదవారు చదువుకునే రోజులు లేకుండా పోయాయని, ప్రైవేట్ రంగాన్ని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు చనిపోతున్నా..అమ్ముడుపోయిన మీడియా ఏమీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన సభలో వైయస్ జగన్ ప్రసంగించారు.
- నెల్లూరు నగరానికి తాగునీరు, సాగునీరు అందించే నెల్లూరు బ్యారేజి పనులు మీరు చూస్తున్నారు. నాన్నగారి హయాంలోనే ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి, సగం పనులు పూర్తి చేశారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఐదేళ్ల చంద్రబాబు పాలన కూడా చూశారు. ఇవాల్టికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదంటే ఇంతకంటే దారుణమైన పాలన ఎక్కడైనా కనిపిస్తుందా?
- నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలో అవినీతితో ప్లాట్లు కడుతున్నారు. అవినీతి చేయడం కూడా పేదవారి నుంచి దోచుకోవాలనే దిక్కుమాలిన ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు. ఈయన్ను ముఖ్యమంత్రి అనాలా? రాక్షసుడు అనాలా? ఒక ప్లాట్ కట్టడానికి ఎంత ఖర్చువుతుందంటే ఎవరైనా చెబుతారు. చంద్రబాబు కట్టే ప్లాట్లలో గ్రైనెట్ పోరింగ్ ఉండదు, లిప్టు ఉండదు. అలాంటి ప్లాట్ కట్టడానికి అక్షరాల రూ.1000 మించదు. చంద్రబాబు ఆ పేదవాడికి అమ్మెది అడుగు రూ.2 వేల చొప్పున అమ్ముతున్నారు. రూ.6 లక్షలకు ప్లాట్ అమ్ముతున్నారు. ఇందులో రూ.1.50 కేంద్రం, మిగిలిన రూ.1.50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట. మిగిలిన రూ.3 లక్షలు పేదవాడికి అప్పుగా ఇస్తారట. ఆ రూ.3 లక్షలు పేదవాడు కడుతూ పోవాలట. చంద్రబాబు తీసుకునే లంచాలకు పేదవాడు కంతులు కడుతూ పోవాలట. ఇలాంటి అన్యాయమైన పాలన చూస్తే ఆశ్చర్యమనిసిస్తుంది.రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక ఆ పేదవాడిపై ఉన్న రూ.3 లక్షల అప్పును మాఫీ చేస్తానని మాట ఇస్తున్నాను. వాళ్లు ఇచ్చే ప్లాట్లు తీసుకోండి..వద్దనకండి.
- ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉండాలని నాన్నగారు భావించారు. నెల్లూరు జిల్లాకు సింహపూరి యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. పిల్లలకు బాగా చదువులు చెప్పించాలని ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేయాలి. ఈ యూనివర్సిటీలో అక్షరాల 200 పోస్టులు ఖాళీగా పెట్టారు. ఈ యూనివర్సిటీలో అవినీతి, అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఇవాళ రాష్ట్రంలో చదువుల పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేయండి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు ప్రభుత్వ విద్యను ప్రైవేట్ రంగంలోకి తీసుకెళ్లేందుకు ఆరాట పడుతున్నారు. కారణం ఆ ప్రైవేట్ రంగంలో ఉన్నది చంద్రబాబు బినామీలుగా ఉన్న నారాయణ సంస్థలు.
- ఈ రోజు నారాయణ స్కూళ్లలో ఎల్‌కేజీ చదవాలంటే ఏడాదికి రూ.25 వేలు ఫీజులు గుంజుతున్నారు. ఇంజినీరింగ్‌కు రూ.1 లక్ష వసూలు చేస్తున్నారు. ఇవాళ ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను చదువులు చదివించే స్థితిలో ఉన్నారు.
- నెల్లూరు నగరంలోని జనార్ధన్‌రెడ్డి నగర్‌లో ఉన్న పేదల ఇళ్లను పూర్తిగా లాక్కున్నారు. వారికి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేయలేదు. దయలేని, మోసం చేసే పరిపాలన, అవినీతి చేసే పరిపాలన ఐదేళ్ల చంద్రబాబు పాలనలో చూశాం.
- వ్యవస్థలను కూడా చూడండి. మీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ ఉన్నాడు. యువకుడు, సౌమ్యుడు, మంచివాడు. మంచిచేసేందుకు సొంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వంటి అమ్ముడపోయిన మీడియా వ్యవస్థ తప్పుగా చూపిస్తున్నాయి. నారాయణ సంస్థల్లో పిల్లలు చనిపోతున్నారు. పేపర్లు లీకులు చేస్తున్నారు. నారాయణ సంస్థల్లో చేయని అన్యాయం ఉండదు. అటువంటి కాలేజీ యాజమాన్యం నారాయణ గొప్పవాడు అని ఈ మీడియా రాస్తోంది. ఒక్కసారి గమనించండి.
- వచ్చే గురువారం 11వ తేదీ ఎన్నికలు జరుగుతున్నాయి. మార్పు కోసం ఓటేయమని కోరుతున్నాను. 2004 ఎన్నికలు ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. నాన్నగారికి ఒక్క అవకాశం ఇచ్చారు. ఆ తరువాత మంచి పాలన అందించి మీ మనస్సుల్లో చెరగని ముద్ర వేయించుకున్నారు. ఒక్కసారి వైయస్‌ఆర్‌సీపీకి అవకాశం ఇవ్వండి, జగన్న అనే మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి. ఆ తరువాత రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని చేసి చూపిస్తాను. చనిపోయిన తరువాత ప్రతి ఇంట్లో నాన్న ఫోటోతో పాటు నా ఫొటో కూడా ఉండేంత గొప్ప పరిపాలన ఇస్తానని మాటిస్తున్నాను.
- 3648 కిలోమీటర్ల నా పాదయాత్ర చూశారు. ఈ పదేళ్లలో వందల కొద్ది చేసిన ధర్నాలు, దీక్షలు చూశారు. ఆందోళనలు చూశారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి..ఈ రాష్ట్రాన్ని ఎలా మార్చిచూపుతానని హామీ ఇస్తున్నాను.
- ఇవాళ నేను కోరేది ఒక్కటే..చంద్రబాబు పరిపాలన చూశారు. కుట్రలు, కుతంత్రాలు రోజు రోజుకు ఎక్కువతున్నాయి. ఎన్నికల నాటికి ఈ కుట్రలు ఎక్కువవుతాయి. ఎన్నికల రోజు మీ గ్రామాలకు మూటల మూటలు డబ్బులు పంపిస్తారు. మళ్లీ మోసం చేసేందుకు..ఓట్లు కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు దిగుతారు. మీరు ప్రతి వార్డులో ప్రతి ఒక్కరిని కలవండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం.
- రానున్న రోజుల్లో ఈ కుట్రలు ఇంకా పెరుగుతాయి. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. మీరందరు గ్రామాలకు వెళ్లి ప్రతి ఒక్కరికి చంద్రబాబు మోసాల గురించి చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని గ్రామాల్లోని అక్కాచెల్లమ్మలకు, అవ్వ తాతలకు చెప్పండి. ఇరవై రోజులు ఓపిక పట్టమని చెప్పండి. జగనన్న చెప్పకపోయి ఉంటే పించన్ రెండు వేలకు పెరిగేదా అని గుర్తుచేయండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్న ఏటా రూ. 15 వేల రూపాయలు ఇస్తాడని ప్రతి అక్కాచెల్లమ్మకు చెప్పండి. ఏ చదువైనా అన్న చదివిస్తాడని.. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాడని ప్రతి ఇంట్లో చెప్పండి. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయని చెప్పండి. మహిళలను లక్షాధికారులను చేయాలనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రైతలకు గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా.. గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాం. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల గురించి ప్రతి అవ్వకు, తాతకు చెప్పిండి. నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా అనిల్‌కుమార్‌యాదవ్, ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభౠకర్‌రెడ్డి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.