మహానేతకు వైయస్ జగన్‌ ఘన నివాళి

17 May, 2019 11:56 IST

 ఇడుపులపాయ : మహానేత వైయ‌స్‌ రాజశేఖర్‌ రెడ్డికి ఆయన తనయుడు, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైయ‌స్ఆర్‌ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఉదయం ఇడుపులపాయలోని వైయ‌స్ఆర్‌ ఘాట్‌ను సందర్శించారు. వైయ‌స్‌ జగన్‌తో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి, పలువురు పార్టీ నేతలు కూడా మహానేతకు అంజలి ఘటించారు. అనంతరం వైయ‌స్‌ జగన్‌ హైదరాబాద్‌ బయల్దేరారు.

కాగా నిన్నరాత్రి వైయ‌స్‌ జగన్‌ కడప అమీన్‌పూర్‌ దర్గాను సందర్శించారు. దర్గా నిర్వహకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్‌ సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనితో కలిసి ఇఫ్తార్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో దర్గా ప్రాంగణమంతా భక్తులు, అభిమానులతో కిక్కిరిసిపోయింది.