ఇంటివద్దే ‘జగనన్న గోరుముద్ద’
24 Mar, 2020 11:17 IST

అనంతపురం : కోవిడ్ –19 కలకలంతో మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నేరుగా ఇళ్లవద్దే ‘జగనన్న గోరుముద్ద’ కింద మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. బియ్యం, చిక్కీ, కోడిగుడ్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్ల ద్వారా 31వ తేదీ వరకూ విద్యార్థులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయనున్నారు.