బ్రహ్మనాయుడు కుటుంబానికి వైయస్ జగన్ భరోసా
8 Jun, 2026 10:36 IST
తాడేపల్లి: మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా నిలబడుతుందని మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బ్రహ్మనాయుడు అరెస్ట్ నేపథ్యంలో మాజీ సీఎం వైయస్ జగన్ బ్రహ్మనాయుడు కుమారుడు బొల్లా గిరిబాబుతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని, అవసరమైన న్యాయ సహాయాన్ని పార్టీ లీగల్ సెల్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని, సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందని భరోసా కల్పించారు.