కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో వైయస్ జగన్ భేటీ
14 Jun, 2019 18:13 IST
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై అమిత్ షాతో ఆయన చర్చిస్తున్నారు. రేపు నీతి అయోగ్ సమావేశంలో సీఎం వైయస్ జగన్ పాల్గొననున్నారు. అలాగే రేపు వైయస్ఆర్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా హాజరుకానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. ఏపీ సమస్యలపై ఎలా వ్యవహారించాలో ఎంపీలకు వైయస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు.