ప్రమాణ స్వీకారానికి రండీ..
25 May, 2019 17:58 IST
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీకి కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన వైయస్ జగన్ అనంతరం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎదురెళ్లి వైయస్ జగన్, వైయస్ భారతీలకు స్వాగతం పలికారు. ఈ నెల 30వ తేదీన విజయవాడలో జరుగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వైయస్ జగన్, ఆయన సతీమణి వైయస్ భారతి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, మంత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్‌కు కేసీఆర్, తెలంగాణ మంత్రులు అభినందనలు తెలిపారు. వైయస్ జగన్ వెంట ఎంపీ మిథున్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, తదితరులు ఉన్నారు.