గవర్నర్‌తో సీఎం వైయస్ జగన్ భేటీ
13 Jun, 2019 17:24 IST
అమరావతి: రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ గేట్ వే హోటల్‌లో వైయస్ జగన్ గవర్నర్‌ను కలిశారు. రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. కొత్త సభ తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ మేరకు వైయస్ జగన్ గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా కలిశారు.