మద్య నియంత్రణ, నిషేధంపై సీఎం సమీక్ష
28 Aug, 2019 15:46 IST
అమరావతి: మద్యం నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో లిక్కర్ నియంత్రణపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. స్మగ్లింగ్ జరగకుండా, నాటుసారా తయారీ కాకుండా చూడాలన్నారు. మద్యం వల్ల కలిగే అనర్ధాలపై పాఠ్య ప్రణాళికలో ఉంచాలని ఆదేశించారు. గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగులకు మద్యం నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మద్యం నిషేధం అమలు కోసం గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుల వినియోగించాలన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని ఆదేశించారు.