విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష
27 Jun, 2019 12:12 IST
అమరావతి : విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష కొనసాగుతుంది.ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల సత్వర పరిష్కారంపై అధికారులతో సీఎం చర్చ జరిపారు. పాఠశాలల ఆధునీకరణ, మౌలిక వసతుల పెంపునకు చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అమ్మఒడి పథకం విధివిధానాల రూపకల్పనపై అధికారులతో చర్చించనున్నారు. ఇంటర్, ఉన్నత విద్యాశాఖల్లో చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్థేశం చేయనున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.