నేడు, రేపు పార్టీ నేతలతో వైయస్ జగన్ భేటీ
21 Aug, 2024 10:20 IST
అమరావతి: మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధ, గురువారం పార్టీకి చెందిన నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రోజుల్లో వైయస్ జగన్ ఇతరులను కలిసేందుకు సమయం ఉండదని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది.