పలు జిల్లాల నేతలతో వైయస్ జగన్ భేటీ
26 Sep, 2024 18:15 IST
తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగనమోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల నేతలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించారు. పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంపై వైయస్ జగన్ దిశా నిర్దేశం చేశారు.
ఈ భేటీలో సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అవంతి శ్రీనివాస్, కేకే రాజు పాల్గొన్నారు. కాగా, నిన్న(బుధవారం) ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు.