రేపు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ భేటీ
24 Apr, 2025 00:07 IST
తాడేపల్లి: వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైయస్ఆర్ సీపీ స్థానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో రేపు(గురువారం) ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం కానున్నారు.
స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా రేపు తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్ వైయస్ఆర్ సీపీ నేతలతో భేటీ కానున్నారు.
ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరు కానున్నారు.