ఈనెల 18న గవర్నర్‌తో వైయస్ జగన్ భేటీ
తాడేపల్లి: రాష్ట్రంలో 10 కొత్త మెడికల్ కాలేజీల ప్రై వేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల సేకరణపై రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్‌కు నివేదించేందుకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 18న ఆయనతో భేటీ కానున్నారు. ఆరోజు సా 4 గం.కు పార్టీ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీ వైయస్ జగన్, గవర్నర్ గారిని కలవనున్నారు. ఈ మేరకు గవర్నర్ స్పెషల్ సీఎస్ నుంచి వైయస్ఆర్‌సీపీకి లేఖ అందింది.
కాగా, ఇంతకు ముందు గవర్నర్‌గారు ఈనెల 17న అపాయింట్‌మెంట్ ఇచ్చారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఒకరోజు వాయిదా వేస్తూ, ఈనెల 18న అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేశారు.
కొత్త మెడికల్ కాలేజీల ప్రై వేటీకరణపై ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ గారికి నివేదించడంతో పాటు, పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను కూడా గవర్నర్ గారికి చూపించనున్నారు. ఆ మేరకు 26 జిల్లాల నుంచి ఆ పత్రాలను ప్రత్యేక వాహనాల్లో విజయవాడకు తరలిస్తున్నారు.