అమెరికా విదేశాంగ శాఖ అధికారులతో సీఎం వైయస్ జగన్ భేటీ
వాషింగ్టన్ డీసీ: అమెరికా విదేశాంగ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం అయ్యారు. మధ్య, దక్షిణాసియా వ్యవహారాల ఉప మంత్రి థామస్ వాజ్దాతో భేటీ సీఎం భేటీ అయ్యారు. హైదరాబాద్ కాన్సులేట్ కొత్త జనరల్ జోయల్ రిచర్డ్‌తో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ వ్యవహారాల డైరెక్టర్ క్లాడియా లిలైన్‌ఫీల్డ్‌తో సీఎం చర్చలు జరిపారు. గ్లోబల్ సస్టెనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ క్లేనెస్లర్‌తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. అలాగే జాన్సల్ కంట్రోల్ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సోలార్ పవర్, ఉపకారణాల తయారీలో ప్రముఖ సంస్థ జాన్సన్ కంట్రోల్స్ స్మార్ట్ సిటీ నిర్మాణంలో సహకారం అందిస్తామని జాన్సన్ కంట్రోల్స్ పట్టణాభివృద్ధి, జల నిర్వాహణలో సహకారానికి జీలీడ్ సైన్సెస్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ పరిశోధనలో ఏపీకి సహకరిస్తామని జీలీడ్ సైన్సెస్ సభ్యులు పేర్కొన్నారు.