18న కర్నూలుకు వైయస్ జగన్
16 Dec, 2024 20:04 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న కర్నూలులో పర్యటించనున్నారు.
బెంగళూరు నుంచి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కర్నూలు చేరుకుని అక్కడి జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైయస్ఆర్‌సీపీ నేత తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు వైయస్ జగన్ హాజరవుతారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.