భవానీపురం దర్గా ఉరుసు ఉత్సవాలకు వైయ‌స్ జగన్‌కు ఆహ్వానం  

11 Mar, 2026 16:09 IST

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ  కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయ‌స్ జగన్‌ను విజయవాడ భవానీపురం దర్గా గంధ మహోత్సవ 438వ ఉరుసు ఉత్సవాలకు దర్గా ముజావర్ల కమిటీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా హజరత్ సయ్యద్ గాలిబ్ షాషీద్ దర్గా ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. భవానీపురంలో ఈ నెల 16వ తేదీ నుంచి దర్గా ఉరుసు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వైయ‌స్ జగన్ హజరత్ సయ్యద్ గాలిబ్ షాషీద్ బాబాకు చాదర్ (శేషవస్త్రం), చందనం, శాండిల్ ఆయిల్ సమర్పించారు. దర్గా ఉరుసు ఉత్సవాలు సోదరభావం, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. సమాజంలో శాంతి, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షిస్తూ ఉరుసు ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా, ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ 41వ డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ ఇర్ఫాన్, ముజావర్ల కమిటీ సభ్యులు అబ్ధుల్ రెహమాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ అల్తాఫ్ అలీ, మహ్మద్ నసీమ్, మహ్మద్ షబ్బీర్, మహ్మద్ ఏజాజ్ పాల్గొన్నారు.