చంద్రబాబును ప్రమాణస్వీకారానికి ఆహ్వానించిన వైయస్ జగన్
28 May, 2019 13:00 IST
అమరావతి: ఈ నెల 30న జరుగనున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో గురువారం వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌లను వైయస్ జగన్ స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైయస్ జగన్ ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆహ్వానించారు.