రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన వైయస్ జగన్
వైయస్ఆర్ జిల్లా: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 10 కోట్లతో ఆధునికీకరణ చేసిన వైయస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. అనంతరం.. ఆయన ఆస్పత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.
పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలో లోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే.. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు.