వైయస్ జగన్ ఇంట్లో సర్వమత ప్రార్థనలు
30 May, 2019 11:26 IST
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్వగృహంలో సర్వమత ప్రార్థనలు చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం వేదపండితులు, ఆలయ అధికారులు వైయస్ జగన్‌ను దీవించి, తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని, రాష్ట్రం సుబీక్షంగా ఉండాలని ప్రార్థనలు చేశారు.