పులివెందులలో వైయ‌స్ జగన్ ఘన విజయం

23 May, 2019 17:11 IST

 వైయ‌స్ఆర్ జిల్లా:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ఘన విజయం సాధించారు. కడప జిల్లా పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వైయ‌స్ జగన్ భారీ మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి సతీశ్ రెడ్డిపై 90,543 ఓట్ల మెజార్టీతో వైయ‌స్ జగన్ విజయ ఢంకా మోగించారు. గతంలో కంటే వైయ‌స్ జగన్ సాధించిన మెజార్టీ భారీగా పెరిగింది. వైయ‌స్ జగన్ సాధించిన మెజార్టీపై పార్టీ నేతలు, కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు. ఈ సందర్భంగా వైయ‌స్ జగన్ కు అభినందనలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకున్నారు.