ప్రేమ, త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే

3 Apr, 2026 11:12 IST

తాడేప‌ల్లి: గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు శిలువ వేయబడిన ఘటన ప్రేమ, కరుణ, త్యాగానికి అత్యున్నత ఉదాహరణగా నిలుస్తుందని వైయ‌స్ఆర్‌సీపీ  అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. ఈ పవిత్ర దినాన ప్రతి ఒక్కరూ కాసేపు ఆలోచించి, మనలో మనం చూసుకుని, మన విలువలను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.

“మనలను మనం ప్రేమించినట్టే ఇతరులను ప్రేమించాలి” అనే యేసుక్రీస్తు బోధనే సమాజానికి మార్గదర్శకమని ఆయన తెలిపారు. పరస్పర ప్రేమ, సహనం, క్షమాభావం వంటి విలువలను ఆచరణలో పెట్టినప్పుడే సమాజం శాంతి, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతుందని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో సందేశం పోస్టు చేశారు.