కాసేపట్లో పులివెందులకు వైయస్ జగన్
15 Mar, 2019 11:34 IST
హైదరాబాద్: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో పులివెందులకు బయలుదేరుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హఠాణ్మరణంతో వైయస్ జగన్ పులివెందులకు బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం గానీ, రేపు గానీ వివేకానందరెడ్డికి అంత్యక్రియలు నిర్వహిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. వివేకా మృతిపై అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండు చేశారు.