నిర్మలా శిశు భవన్‌లో వైయ‌స్‌ రాజారెడ్డి శత జయంతి 

29 May, 2025 14:43 IST

విజయవాడ: దివంగత మహానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి తండ్రి, దివంగత వైయ‌స్‌ రాజారెడ్డి శత జయంతి వేడుక‌లు విజ‌య‌వాడ న‌గ‌రంలోని నిర్మ‌లా శిశు భ‌వ‌న్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.  ఈ వేడుకల్లో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని వైయ‌స్ రాజారెడ్డికి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.  

YS Jagan Family Participated In Raja Reddy Jayanthi Celebrations

ఈ సందర్బంగా నిర్మల శిశు భవన్‌లో ఉన్న పిల్లలతో వైయ‌స్‌ జగన్‌, వైయ‌స్ భారతి దంపతులు ముచ్చటించారు. వారితో సరదాగా గడిపారు.  కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌  సోదరి వైయ‌స్‌ విమలారెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు. మరోవైపు.. పులివెందులలో రాజారెడ్డి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో వైయ‌స్‌ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.