‘యోగా’ మన జీవితంలో భాగం కావాలి
21 Jun, 2025 11:00 IST
తాడేపల్లి: ‘యోగా’ మన జీవితంలో భాగం కావాలని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంతతను పెంపొందించడానికి యోగా ఎంతగానో సహాయపడుతుందని ఆయన చెప్పారు.
ఎక్స్ వేదికగా వైయస్ జగన్..
‘యోగా అనేది మన శరీరం, ఆత్మ రెండింటిపైన పని చేస్తుంది. ప్రశాంతతను పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. అలాంటి యోగాను.. మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందాం’ అని వైయస్ జగన్ తెలిపారు.